Header Banner

టాలీవుడ్ స్టార్ విలన్ కన్నుమూత.. పాపం 54 ఏళ్లకే దారుణమైన చావు! ఏమైందంటే?

  Sat May 24, 2025 12:33        Entertainment

హిందీ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. 'సన్ ఆఫ్ సర్దార్', 'ఆర్.. రాజ్‌కుమార్', 'జై హో' వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన ఆయన స్నేహితులు శనివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, ముకుల్ దేవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆయన సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ ఈ మరణవార్తను సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముకుల్ దేవ్‌తో ఉన్న పాత చిత్రాన్ని పంచుకుంటూ "RIP" అని పేర్కొన్నారు. ముకుల్ దేవ్, ప్రముఖ నటుడు రాహుల్ దేవ్‌కు సోదరుడు.

 

ఇది కూడా చదవండి: విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఆయన చివరిగా 'అంత్ ది ఎండ్' అనే హిందీ సినిమాలో కనిపించారు. న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించిన ముకుల్ దేవ్ తండ్రి హరి దేవ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. ఆయన ద్వారానే ముకుల్ దేవ్‌కు ఆఫ్ఘన్ సంస్కృతి పరిచయమైంది. ఆయన తండ్రి పష్తో, పర్షియన్ భాషలు మాట్లాడగలిగేవారు. అంతేకాకుండా, ముకుల్ దేవ్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుంచి పైలట్‌గా కూడా శిక్షణ పొందారు. నటనపై ఆసక్తితో ముకుల్ దేవ్ ఎనిమిదో తరగతిలోనే తొలి పారితోషికం అందుకున్నారు. దూరదర్శన్ నిర్వహించిన ఓ డ్యాన్స్ షోలో మైఖేల్ జాక్సన్‌ను అనుకరించి ఆయన ఈ గుర్తింపు పొందారు. 1996లో 'ముమ్కిన్' అనే టెలివిజన్ సీరియల్‌లో విజయ్ పాండే పాత్రతో నటనారంగంలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్‌లో ప్రసారమైన 'ఏక్ సే బధ్ కర్ ఏక్' అనే కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షోలో కూడా ఆయన నటించారు. 'ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా' మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక సినిమాల విషయానికొస్తే, 'దస్తక్' చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో ఏసీపీ రోహిత్ మల్హోత్రా పాత్రలో ఆయన నటించారు. ఈ చిత్రంతోనే మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ముకుల్ దేవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

           

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Bollywood #KapilSharma #RajpalYadav #RemoD'Souza #SugandhaMishra